Israeli Airstrike: అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ భీకర ఉగ్రదాడి చేసింది. 1200 మందిని క్రూరంగా హతమార్చింది. చాలా మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు చేసి, ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన టాప్ లీడర్లు ఇస్మాయిల్ హానియే, యాహ్యా సిన్వార్‌లను హతమార్చింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వెతికి వేటాడి చంపేసింది.