ICC: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా, యుద్ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఈ వారెంట్లను జారీ చేసింది. ఆకలిని యుద్ధపద్ధతిగా ఉపయోగించారిన ఐసీసీ చెప్పింది. వారెంట్ల ప్రకారం.. ఐసీసీ 122 సభ్య దేశాల భూభాగంలోకి నెతన్యాహూ, గాలంట్ ప్రవేశిస్తే వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.
Read Also: President Droupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గతేడాది అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసి 1200 మందిని హతమార్చారు. 240 మంది వరకు ఇజ్రాయిలీ బందీలనున గాజాలోకి పట్టుకెళ్లారు. ఈ దాడి తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణించారు. ఇప్పటికే 44,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. మరోవైపు 101 మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఇజ్రాయిల్ వెతుకుతోంది.