US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. Read…
ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ మరోసారి విధ్వంసం సృష్టించింది. కిర్కుక్ సమీపంలోని చెక్‌పోస్ట్ దగ్గర దాడికి దిగింది. ఈదాడిలో పదమూడు మంది పోలీసులు మరణించారు.ఐఎస్ఐఎస్ దాడులతో ఇరాక్ అతలాకుతలమవుతోంది. ఇరాకీ పోలీసులే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో.. పదముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ ఉత్తరభాగంలోని కిర్కుక్ నగర సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద .. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడికి దిగింది. రెండు చోట్ల దాడులు చేశారు ఉగ్రవాదులు. అర్థరాత్రి సమయంలో దాడి జరిగినట్లు సీనియర్ ఇరాకీ పోలీస్ అధికారి తెలిపారు.…