Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ గత పది రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి కుట్ర పన్నాడు. దీంతో పంజాబ్ పోలీసులు అతడిపై అతని అనుచరులపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే అతని అనచరులను ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ…
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం గత 10 రోజులుగా వేట సాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. పూర్తిగా వేషధారణ మార్చి, తలపాగా తీసేసి మోడ్రన్ లుక్ తో తన రూపాన్ని మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నేపాల్ కు పారిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు అమృత్ పాల్ సింగ్…
Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి అమృత్ పాల్ సింగ్ మామయ్య హరిజీత్ సింగ్ లొంగిపోయారు. ఆయన మీదా ఎన్ఎస్ఏ కేసు నమోదు అయిందని.. అతనిని డిబ్రూగఢ్ జైలుకు తరలించామని పోలీసులు వెల్లడించారు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి ఒక్కో విషయం బయటపడుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఇందులో దాగున్నట్లు తెలుస్తోంది. ఇతనికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడికి సహాయకుడిగా ఉన్న ఢిల్లీ చెందిన దల్జీత్ కల్సికి పాక్ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నాయి.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడైన అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ విస్తృతంగా వెతుకుతున్నాయి. పంజాబ్ సరిహద్దులను మూసేసి అతడిని పట్టుకునేందుకు రెండు రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 మంది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
"Khalistan" trending on Twitter: ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ అనుచరులు, బాడీగార్డులను కలుపుకుని 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ అంతటా ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్లాఖా బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్…
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.