ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’తో చక్కని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. అదే నెల చివరి వారంలో విడుదలైన ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. విశేషం ఏమంటే… ఇదే పేరుతో 2019లో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది రీమేక్. కాస్తంత గ్యాప్ తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే…
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర…