రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం. రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం.కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదు. భూగర్భజలాలు పెరిగాయి.4వేల చెక్ డ్యామ్ లను 6వేల కోట్లతో నిర్మించుకున్నాం.…
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగిలో మన ఊరు-మన పోరులో పాల్గొన్నారు. తెలంగాణలో 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మానిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగాడన్నారు. చేవెళ్లను కొండ పోచమ్మ లో ముంచిండు, చెల్లమ్మను…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి తెరదించాలన్న ఉద్దేశంతో గెజిట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఆ గెజిట్లపై తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో.. జలసౌధలో ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం కొనసాగుతోందని వెల్లడించిన ఆయన.. పాలనాపరమైన, సాంకేతికపరమైన, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయపరమైన…