ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
గోదావరి డెల్టాకు రబీకింద సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు.
ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…
పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్…
పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర ఉత్తమంగా ఉండాలి. వందేళ్ళ నుండి ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూసాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచి పెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు.…
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ…