Home
Irrigation Projects
Irrigation Projects News
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
రాష్ట్రంలో ప్రబలిన వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరువు తీవ్రతకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలతో పాటు గ్లోబల్ ‘ఎల్ నినో’ ప్రభావమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని, ఏ ఒక్క అన్నదాతనూ ఒంటరిగా వదలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. రైతులకు ముందస్తు అవగాహన.. ప్రాజెక్టులకు వాటర్… -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మూడో విడత కింద రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. 1996లో తానే స్వయంగా ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని,… -
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగు నీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే..… -
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు, ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాపాతం తీవ్రమవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయాలు సంతరించుకుంటున్న జలకళ రైతుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆనందాన్ని నింపుతోంది. -
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
మహబూబ్ నగర్ జిల్లా కరివేన వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి, పాలమూరు భవిష్యత్తు కోసం ఎలాంటి అడుగులు వేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటా 2009లో కష్టకాలంలో తనను అక్కున చేర్చుకుని మహబూబ్… -
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
CM Revanth Reddy : పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఈ సర్వేలో పాల్గొన్నారు. కీలక ప్రాజెక్టుల… -
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
Kharif Water Release: ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదలపై సమగ్రంగా చర్చించనున్నారు.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్కు… -
TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. Also Read:Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా?… -
Tummala-Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ..
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… -
BRS : ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం
BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీకి చెందిన కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా కృష్ణా-గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా…
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!