Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం ఉన్నందున ఈ వర్షాకాలంలోనే అన్ని గేట్లను తెరవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
సచివాలయంలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని అధికారులకు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలో.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి అని సూచించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం.. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి అని తెలిపారు.
నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ఏపీ పోలీసులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అంశాలు ఏమున్నాయంటే..
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
CM KCR Review: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్ఏల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరు రెవెన్యూ శాఖలో రూ.10.500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి సేవలను అదేశాఖలో క్రమబద్దీకరించడంతో పాటు కొత్త పేస్కేల్ ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.