ఇండియన్ టెకీలకు ప్రపంచంలో భారీ డిమాండ్ ఉన్నది. ప్రపంచంలోని టాప్ కంపెనీలు సీఈఓలుగా భారతీయులను నియమించుకుంటున్నది. కష్టపడే తత్వం భారతీయుల లక్షణం కావడంతో కంపెనీ సీఈఓలుగా నియమితులవుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు నియమితులైనారు. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పరాస్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీనిపై స్టైప్ కో ఫౌండర్, ఐరిష్ బిలినియర్ స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …