iQOO 15 Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమింగ్‌పై ప్రత్యేక దృష్టితో దూసుకెళ్తున్న ఐక్వూ (iQOO) సంస్థ తన మొదటి అల్ట్రా (Ultra) సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఐక్వూ 15 అల్ట్రా (iQOO 15 Ultra)ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత రెండు సంవత్సరాలుగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ప్రో మోడళ్లను ప్రవేశపెట్టని ఐక్వూ, 2024లో iQOO 13ను, 2025లో iQOO 15ను మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు తొలిసారిగా ‘అల్ట్రా’ బ్రాండింగ్‌తో కొత్త మోడల్‌ను తీసుకురావడం విశేషం.…