ఐపీఎల్ 2025లో మార్చి 28న సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.