ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు.…