ఐపీఎల్ 2025 ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మరికొన్ని గంటల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌లో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై విజయంతో బెంగళూరు నేరుగా ఫైనల్ చేరుకోగా.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి పంజాబ్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్స్‌లో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. కొత్త ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆర్సీబీనే కప్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు కారణం ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ట్రోఫీ అందుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టులోని యువ ప్లేయర్స్ కూడా కప్పు అందుకున్నారు కానీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అంతేకాదు పలు సారథుల నాయకత్వంలో బ్యాటర్‌గా కష్టపడ్డా ఫలితం దక్కలేదు. అయితే ఎన్నో ఏళ్ల కలకు…
రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్…
18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా ట్రోఫీని అందుకోని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఉన్నాయి. భారీ అంచనాలతో లీగ్‌ను ఆరంభించడం, ఆపై ఉసూరుమనిపించడం మొన్నటివరకు ఆర్‌సీబీకి పరిపాటిగా మారింది. అయితే ఈసారి మాత్రం అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. మూడుసార్లు చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. మరోవైపు 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్.. అనంతరం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. ఈసారి…
IPL 2025 Final: గత 2 నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు సిద్ధమైంది. ఈసారి ఓ కొత్త ఛాంపియన్ రాబోతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జూన్ 3న అహ్మదాబాద్ లో ఫైనల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసాయి. ఇకపోతే రేపు జరగబోయే ఫైనల్ ముందు ఇరు జట్ల కెప్టెన్స్ ఐపీఎల్ ట్రోఫీతో…
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గెలుస్తుందని మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. క్వాలిఫయర్-1లో తేలిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని ఏబీడీ తెలిపాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన ఆర్‌సీబీ నేరుగా…
ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఆర్‌సీబీ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఇక ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు ఆర్‌సీబీ అడుగు దూరంలో నిలిచింది.…
IPL 2025 Final: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది.
IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా కనిపించబోతుంది. ఇందుకోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతం చేసిన మన భద్రతా దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించాలని ప్లాన్ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి తెలిపింది. తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరు, కోల్‌కతా మధ్య జరుగుతుంది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ 2025 నిలిచిపోయిన…