ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో కూడా గెలువాలనే కసితో ఉంది. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని కోరుకుంటుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్పై గుజరాత్ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు రెండింటిలో గెలిచిన సీఎస్కే.. మరో విజయంపై కన్నేసింది. కాగా.. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడి.. ఈ మ్యాచ్ లో గెలువాలనే కసితో ఉన్నారు.
ఎప్పటిలాగానే ఈ సీజన్లో కూడా తగినంత ప్రతిభ చూపించడం లేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. ఇక.. జట్టు పరంగా చూస్తే అందరూ మంచి ఆటగాళ్లే కనపడుతున్నారు. కోహ్లీ, మ్యాక్స్ వెల్, గ్రీన్, డుప్లెసిస్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. తగినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన డుప్లెసిస్.. బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఇకపోతే.. బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 163 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.
సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన హసరంగ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్‌లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్…
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికే రారాజుగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఏ రికార్డు చూసిన కోహ్లీ పేరు కచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే ఫన్నీగా ఉంటాడు. తాను ఉండడమే కాకుండా పక్కవారిని కూడా నవ్విస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిజానికి విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కోహ్లీ తన తోటి ఆటగాడిని సరదాగా ర్యాగింగ్…
చివరి మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండు జట్లూ ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉన్నాయి. రెండు జట్లూ ఒకే ప్రత్యర్థి ముంబై…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో.. లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు భారీ స్కోరును నిర్దేశించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటాన్ డికాక్ (54) అర్ధసెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశాడు.