ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 ముగుస్తుంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 2024 జరుగుతుండడంతో భారత జట్టు ఎంపికకు ఇదే కీలకం…