ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 ముగుస్తుంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 2024 జరుగుతుండడంతో భారత జట్టు ఎంపికకు ఇదే కీలకం కానుందా? అనే చర్చ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్ ప్రదర్శనే కీలకం కాదని తెలిసింది.
Also Read: R Ashwin-MS Dhoni: ఎంఎస్ ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటా: ఆర్ అశ్విన్
టీ20 ప్రపంచకప్ ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శనతో పాటు మరికొన్ని అంశాలను కూడా సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుందని సమాచారం. ‘ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ముఖ్యం. అయితే ఆ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి వస్తామనుకోవడం సరికాదు. బీసీసీఐ సెలక్టర్లు జట్టు ఎంపికపై ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేసినా లేదా ఫామ్ కోల్పోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఫామ్, ఫిట్‌నెస్ ఎలా ఉందో కూడా సెలక్టర్లు పరిశీలిస్తారు’ అని క్రీడా వర్గాలు తెలిపాయి.