Today Stock Market Roundup 24-03-23: ఈ వారాంతం రోజున.. అంటే.. ఇవాళ.. శుక్రవారం.. ఇండియన్ స్టాక్ మార్కెట్ పేలవమైన ప్రదర్శన చేసింది. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సాయంత్రం కూడా భారీ నష్టాలతోనే ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటం మైనస్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు-2023లో చేసిన సవరణలు ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
Today (31-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ట్రేడింగ్ మొత్తం అస్థిరంగానే సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7 శాతంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగానే ఉంటుందని ఎకనమిక్ సర్వే-2023 పేర్కొనటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో 2 కీలక సూచీలు వరుసగా 2వ రోజు అంటే ఇవాళ కూడా బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.