ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి ఒడిశా పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను దోచుకున్నారని ఫిర్యాదు చేయడానికి రాగా.. ఒడిశా పోలీసులు నిరాకరించారని, దానికి ప్రతీకారంగా వారి వాహనాన్ని దొంగిలించానని ఈ వ్యక్తి పేర్కొన్నాడు.