తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు.
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.