Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్‌వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్‌లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్‌లు పంపించేందుకు…
మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్‌ను పొడిగించారు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత రకరకాల వీడియోలో అందులో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి.. కొన్ని హాస్యాన్ని పంచితే.. కొన్ని జోష్ పెంచుతాయి.. కొన్ని హృదయాన్ని కదిలిస్థాయి.. మరికొన్ని హృదయాన్ని బరువెక్కించి కంటతడి పెట్టిస్తుంటాయి.. ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కిన ఓ వృద్ధుడి వీడియో అందరితో కంటతడి పెట్టిస్తుంది.. ఒక వృద్ధుడు తన రోజువారీ సంపాదనను లెక్కిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఆ హృదయ విదారక క్లిప్ ఇంటర్నెట్‌ను కన్నీళ్లకు గురిచేస్తోంది.. ఇప్పుడు వైరల్…
CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం…
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్‌లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్‌లైన్…
పోర్న్ వెబ్ సైట్లు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు వెళ్లేవారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూసేవారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్‌కేఫ్‌లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అది ఇతరులకు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం…
కోనసీమ జిల్లా వాసులకు 15 రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో తెగ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ వాసులకు గుడ్ న్యూస్ అందింది. రేపటి నుంచి కోనసీమ జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 24 నుంచి 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే నాలుగు రోజులుగా విడతల వారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ప్రస్తుతం అమలాపురం, అల్లవరం…
కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి…
ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధంతో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశంగా ఉండకూడదు అని రష్యా షరతు విధించగా, దానికి ఉక్రెయిన్ తిరస్కరించడం, నాటో కూడా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడంతో యుద్ధం అనివార్యమైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెస్కీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. Read: Smartphones:…