గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసిన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. 88 శాతానికి పైగా ఎక్స్పోర్ట్స్ కేవలం5 రాష్ట్రాల నుంచే జరగటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య విషయంలో ఏపీ కంటే బీహారే బెటర్ పొజిషన్లో ఉందని కేంద్ర వాణిజ్య…
Araku Coffee: చాలా మంది ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగనిదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్ను అరకు కాఫీ విదేశీ మార్కెట్లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా…
టీమిండియా ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు .. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడే స్టువర్ట్ బిన్నీ. రెండుసార్లు రంజీ ట్రోఫీ విజేత కూడా. 37 ఏళ్ల బిన్నీ భారత్ తరపున 23 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో ఆరు…