టీమిండియా ఇంటర్నేషనల్ హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. అక్టోబర్- నవంబర్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ భారత జట్టు స్వదేశంలో ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ లు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. అందుకు సంబంధించి షెడ్యూల్ తో పాటు వేదికలు, టైమింగ్స్ ను కూడా…
అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
రద్దీగా ఉండే రోడ్డుపైనే వాహనాలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారి భూమి బద్దలైంది. దీంతో అక్కడున్న వాహనాలు గాల్లోకి ఎగిరాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.
ఆసియా కప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2021లో జరిగిన T20 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో చీఫ్ సెలెక్టర్ కుర్చీ ఖాళీగా ఉండటంతో.. ఇతని పేరు బయటికొచ్చింది.
ఒక వ్యక్తి ప్రపంచ రికార్డు కోసం వింతగా ఆలోచించాడు. కన్నీరు కార్చి రికార్డు సాధిస్తానని వారం మొత్తం నాన్స్టాప్గా ఏడవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి కంటిన్యూగా ఏడవడంతో.. తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయాడు.