15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (ఆగస్టు 22) సాయంత్రం 5.15 గంటలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆహ్వానం మేరకు ప్రధానికి అక్కడికి వెళ్లారు.
అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లోని గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు.
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా భవనంపై భారతదేశ జెండాను ప్రదర్శించారు. సరిగ్గా అర్థరాత్రి 12.01నిమిషాలకు ఎల్ఈడీ లైట్లతో మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పొంగిపోయారు.
అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హానీకట్ అనే మహిళ అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమేకు 11.8 ఇంచుల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతుంది. బీజింగ్ లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.