క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది.
నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు’ కేసు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి…
యునైటెడ్ స్టేట్స్లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు.
లిబియాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచేశాయి. డేనియల్ తుపానుతో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపు పావు వంతు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.
China: డ్రాగన్ కంట్రీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మానవహక్కులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిందే చట్టం, చెప్పందే వేదం. దేశాన్ని విమర్శించినా, కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ప్రజలు మాయమవుతుంటారు. లేకపోతే జైళ్లలోకి వెళ్తుంటారు. అలాంటి చైనా కొత్తగా మరో చట్టాన్ని తీసుకురాబోతోంది.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.
పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు.
US అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా టెస్లా, X (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ను కోరుకుంటానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.