కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కూరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా.. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఓ డ్యామ్ తెగిపోయి అక్కడి జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా.. రోడ్లు…
ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది.
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై…