స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా…
మయన్మార్ లో రాజకీయ ఖైదీల కేసులను తీసుకోకుండా న్యాయవాదులపై అడ్డంకులు, ఆంక్షలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. "మయన్మార్ లో ఇప్పటికే బలహీనమైన న్యాయ వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. న్యాయ హక్కులను సమర్థించడంలో విఫలమైందని 39 పేజీల నివేదికను విడుదల చేసింది.
రష్యాకు చెందిన యన అనే మహిళ తన భర్త కోసం ఏకంగా 45 కిలోలు ఉన్న ఆవిడ.. 22 కిలోలకు తగ్గిపోయింది. తన భర్త లావుగా ఉండొద్దని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది. అంతకుముందు ఉబ్బిన బుగ్గలు, చక్కటి అందం, రంగుతో ఉండే ఆ మహిళ.. ఇప్పుడు ఆకలితో మాడి చివరకు గుర్తు పట్టలేనంతగా ఓ ఆస్తిపంజరంలా తయారైంది.
న్యూయార్క్ నగరం దట్టమైన పొగతో కమ్ముకుని ఉంది. మంగళవారం అక్కడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు నగరం మొత్తం దట్టమైన పొగతో కప్పేసింది. న్యూయార్క్ నగరం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణమేంటంటే.. కెనడాలో కార్చిచ్చు ప్రభావంగా నగరం మొత్తం ఈ పరిస్థితికి దారితీసింది.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు(బుధవారం) ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. ఈసారైనా కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
యాపిల్ అతిపెద్ద ఈవెంట్ WWDC 2023 నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. యాపిల్ కంపెనీకి పలు ప్రొడక్ట్స్ రిలీజ్ కానున్నాయి. మీరు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తున్నా, లేకపోతే యాపిల్‌కు సంబంధించి బోలెడంతా సమాచారం దీంట్లో లభిస్తాయి. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్, హార్డ్ వేర్ లాంచెస్... ఇలా ఎన్నో ఈరోజు మార్కెట్లోకి రానున్నాయి.
చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. మే నెలలో భారత దేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్లో దాదాపు 42 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ దేశం చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి.