అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈక్రమంలో ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఐరోపా దేశాల కొంప ముంచేలా మారింది. రష్యాను బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న ఓతొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలను పెద్ద షాక్‌ను గురి చేసింది. ఈ నిర్ణయం కారణంగా మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది.…