అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈక్రమంలో ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఐరోపా దేశాల కొంప ముంచేలా మారింది. రష్యాను బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న ఓతొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలను పెద్ద షాక్‌ను గురి చేసింది. ఈ నిర్ణయం కారణంగా మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని, ఈక్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని రష్యా విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆంక్షలను ఏమాత్రం పాటించబోమని స్పష్టం చేసింది.
READ MORE: Krishna Arrest: లైంగిక వేధింపుల కేసులో మరో డాన్స్ మాస్టర్.. విచారణలో సంచలన విషయాలు..
2019లోనే బయటికి వచ్చిన యూఎస్
రష్యా సుదీర్ఘకాలంగా ఒప్పందం ఉల్లంఘిస్తోందని 2019లో ట్రంప్ ఆరోపిస్తూ ఈ ప్లాన్ నుంచి అమెరికాను బయటకు లాగేశారు. 2019లో ట్రంప్ మాట్లాడుతూ.. 9ఎం729 లేదా ఎస్‌ఎస్‌సీ-8 క్షిపణులను రష్యా మోహరించిందని పేర్కొన్నారు. దీనిని అప్పుడు మాస్కో తిరస్కరించింది. ఇటీవల ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు వెలువరించిన మూడు రోజుల్లోనే రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది. అమెరికా (USA) దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడించింది.
READ MORE: EPFO New Rule: యూఏఎన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ టెన్షనే ఉండదు!
ఐఎన్‌ఎఫ్ ఒప్పందం ఏంటి?
ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీగా ఐఎన్‌ఎఫ్ ఒప్పందం దానిని వ్యవహరిస్తారు. 1987లో అమెరికా (USA) అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, రష్యా (Russia) అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజి క్షిపణుల మోహరింపును నిషేధించారు. 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల మధ్యలోవి ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి. ఈ ఒప్పదం కారణంగా అప్పట్లో రెండు దేశాలకు చెందిన దాదాపు 2,692 క్షిపణలను ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ రేంజి క్షిపణుల మోహరింపుతో అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలకే ప్రధాన ముప్పు ఉండనుంది.