Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై హాట్ కామెంట్లు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందించాల్సిన అంశమే కాదన్నారు.. ఇది కేవలం ఆరోగ్య కారణాల పై ఇచ్చిన మధ్యంతర బెయిల్.. చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్ గా ఉండే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధులను ప్రాణాంతకం అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. మధ్యంతర బెయిల్ వచ్చిందని సంబరాలు చేసుకునే వారికి సిగ్గు ఉందా? అంటూ మండిపడ్డారు. కేసు మెరిట్ చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు.
Read Also: AP Government: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం..
చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స కు సంబంధించిన అంశానికి మాత్రమే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, ఎక్కడ గెలిచింది నిజం? స్కిల్ స్కాం జరుగలేదా?పెండ్యాల శ్రీనివాస్ పారిపోవటం వెనుక పాత్ర ఎవరిది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటకు ఎలా వస్తాడు? అని నిలదీశారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావటమే మాకు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదు అనటానికి ఉదాహరణగా పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు రిలీజ్ కానున్నారు.. రాజమండ్రి నుంచి విజయవాడకు ఆయన రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి బయల్దేరి వెళ్లింది..