Today Business Headlines 16-12-22: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
Huge Losses in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఒకటీ అరా మెరుపులు తప్ప రోజంతా లాస్‌లోనే నడిచింది. మార్నింగ్ ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమై ఈవెనింగ్ భారీ నష్టాలతో ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్‌లపై తీవ్రంగా పడింది. సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799 పాయింట్ల…