మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్‌సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభం ఉంటుందని ప్రధాని తెలిపారు.