ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై గత వారం రోజుల నుంచి తీవ్ర గందర గోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఇకనైనా విద్యార్థులు వచ్చే పరీక్షలపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా…
ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగిస్తూ వచ్చిన ఇంటర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వరకు గడువును పొడిగించింది. ఇదే చివరి అవకాశం అని, మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాలని పేర్కొన్నది. ఇక, ఈ విద్యాసంవత్సంలో ఇంటర్‌లో 70 శాతం సిలబస్ మాత్రమే ఉండబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య…
విద్యార్థులు, విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడి.. ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేయడమే కాదు.. ఎన్నో పరీక్షలను కూడా రద్దు చేసింది.. కీలకమైన బోర్డు ఎగ్జామ్స్‌కు రద్దు చేసి.. అందరు విద్యార్థులను పాస్ చేసిన పరిస్థితి.. అయితే, ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ… ఎంసెట్ అడ్మిషన్స్, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా, 5 సంవత్సరాల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కి అర్హత.. ఇంటర్…
ఈరోజు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షా ఫలితాలను విడుదలన చేయనున్నారు. ఇంటెర్నెట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచనల…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం జులైలో జరగాల్సిన ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. మినిమం పాస్ మార్కులు వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది అడ్మిషన్స్ , పరీక్ష ఫీజు చెల్లించిన వారి సంఖ్య పెరిగింది. read also : తెలంగాణలో ఈ రోజు నుండి…
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో..…
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన సర్కార్.. లాక్ డౌన్ ముగియగానే ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు అంటోంది. ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు, ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై రెండో వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తామని…
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జులై నెలలో పరీక్షల నిర్వాహణపై సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం తరపు వాదనలు విన్న తరువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కరోనా విజృంభిస్తుండటంతో వాయిదా వేశారు.…
తెలంగాణలో కరోనా కారణంగా అన్నిరకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. పదోతరగతి పరీక్షలను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వాహణ విషయంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ తన అభిప్రాయం తెలిపింది. జులై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. గతంలోనే ప్రశ్నాపత్రాల ముద్రణ పూర్తయ్యాయని, మార్చడం కుదరదని తెలిపింది. పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరు కుదిస్తామని, రాయాల్సిన ప్రశ్నలను…