ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 23న ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్…
తెలంగాణలో ఇప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు.. దీంతో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది.. ఈ ఏడాది కూడా రిజల్ట్ తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే భయం అధికారులను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇంటర్ పరీక్షలకు దాదాపు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే టెన్త్ ఫలితాలు విడుదల కాగా.. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా కొన్ని రోజులుగా ఫలితాల విడుదల…
తెలంగాణలో ఇంటర్ ఫలితాలతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం పాస్ కావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విద్యార్థి సంఘాలు జూనియర్ కాలేజీల బంద్‌ను సైతం నిర్వహించాయి. దీంతో ప్రతిరోజు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలకు దిగుతున్నారు. అటు జిల్లాల్లో సైతం ఇదేపరిస్థితి నెలకొంది. తరగతులు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి తమను ఫెయిల్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు…
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ తెలిపారు. అనుమానం ఉంటే…
తెలంగాణలో ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసి, తిరిగి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఇంటర్ ఫలితాలలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ అయింది విద్యార్థులా..? లేక ఇంటర్ బోర్డా..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల్లో కొందరికి పదిలోపే మార్కులు వచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకు కూడా ఒకటి రెండు సబ్జెక్టుల్లో…