తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read Also:…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్‌లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్‌లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read…
కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.…
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3…
డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధం అయ్యింది తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు.. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇంటర్ ఫలితాలు ఉంటాయని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.. కాగా, గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా ముగించారు… ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ…
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ పరీక్షలను రద్దు చేశామని అన్నారు. విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులను చేశామని… సుప్రీం కోర్టు జులై 31 లోపు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించిందని తెలిపారు. కానీ గడువుకు వారం ముందే ఫలితాలు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మార్కుల విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని…