బ్రిటీష్ జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది ప్రపంచంలోని అత్యంత అంతరించిపోతున్న ప్రైమేట్స్‌లో ఒకదాని పుట్టుకను జరుపుకున్నారు. అరుదైన సులవేసి క్రెస్టెడ్ మకాక్ కోతి మే 16న చెస్టర్ జూలో ఓ కోతిపిల్లకు జన్మనిచ్చింది.
సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు.
2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కెనడా. అందులో భాగంగానే ఈ నియంత్రణ అమలు చేయనున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని ఆరోగ్య అధికారులు తెలిపారు.
కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని తెలిపింది. కిమ్ చికిత్స కోసం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. కిమ్ కు అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ఔషధాలను వాడుతున్నారంటోంది దక్షిణ కొరియా.