ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా? తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.…
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. చాలా మంది విద్యార్థులు కాలీజీల్లో ఇంకా చేరని పరిస్థితులు లున్నాయి.. అయితే, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో.. నవంబర్ 12వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఇంటర్ బోర్డు.. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్,…