Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. తాజాగా ఆయన షుగర్ వ్యాధి, ఇన్సులిన్ వాడకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తీహార్ జైల్ అధికారులు నివేదిక పంపించారు.