ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి.