Business Headlines 10-03-23: వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్.. అంటే.. విమెన్స్ హబ్.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్‌కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు.