Influenza: భారతదేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. రెండు ఏళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతన్న ఫ్లూతో భయపడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా-ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
Influenza Cases Rise in Puducherry:పుదుచ్చేరిలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతన్నాయి. ఇటీవల కాలంలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధికి సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న తరగతులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, విద్యాశాఖ మంత్రి ఎ. నమశ్శివాయం 1 నుంచి 8వ తరగతి ఉన్న తరగతులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత వారం నుంచి వివిధ ఆస్పత్రుల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగాయి. ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడే పిల్లలతో…