కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు?…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్. మోదీ ప్రభుత్వం మనందరికీ అందించిన నూతన సంవత్సర బహుమతి కొత్త ద్రవ్యోల్బణం. గత ఏడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన కానుక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. బట్టలు, పాదరక్షలు కొనుక్కోవడం దగ్గర్నుంచి ఏటీఎంల నుంచి సొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వరకు ఖరీదు అయ్యాయన్నారు. పెరిగిన GST…
మనదేశ కరెన్సీ విలువ రానురాను పడిపోతోంది. భారత రూపాయి ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత పేలవమని కరెన్సీగా నమోదయిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో రూపాయి విలువ 2.2 శాతం పైగానే క్షీణించింది. రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒమిక్రాన్ వైరస్ భయాలకు తోడు గ్లోబల్ మార్కెట్లలోనూ ప్రతికూలతలే ఇందుకు కారణం. ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాలు రూపాయిని మరింత బలహీనపర్చాయని నిపుణులు అంటున్నారు. వచ్చే మార్చి ముగింపు…