రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని కోరారు.