విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని కోరారు. స్పెక్యులేషన్ మీద ఆధారపడే రాజధాని అంశం నడుస్తోంది.. రియల్ ఎస్టేట్ అంశంగానే రాజధానిని చూస్తున్నారు.. డ్రైనేజీ వ్యవస్ధ సరిగ్గా లేకపోవడంతో పంటలు నీట మునిగాయి.. సంక్షేమం కూడా సంపద పెరుగుదలకు తోడ్పడాలి.. కియా తప్ప పెద్దగా పరిశ్రమలు ఈ పదేళ్ళలో రాలేదు.. విజయవాడలో ఆటోనగర్ చేజారిపోతుంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు.
Read Also: Malavika Mohanan: శారీ అందాలతో మాయచేస్తున్న…మాళవిక మోహనన్
ఉపాధి కల్పన లెక్కలు కాగితాలకే పరిమితం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిపై ఎలాంటి కేసులు పెట్టారు.. దాదాపు 150 మంది డిఫాల్టర్లు ఉన్నారని సమాచారం.. బీజేపీ కొందరు డిఫాల్టర్లకు చోటిచ్చింది.. హిందూపురంలో భూములు బినామీ కంపెనీలకు వెళుతున్నాయి.. ఉపా లాంటి చట్టాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు ఆరోపించారు.