పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు…