ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…
ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ…
1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. గత ఏడేళ్లలో…
ఇంద్రవెల్లి అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. అమరుల త్యాగాలకు చిహ్నం. ఆ ప్రేరణతోనే ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన దండోరా మోగించాలని నిర్ణయించింది కాంగ్రెస్. పార్టీ ప్లాన్ బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమం కాంగ్రెస్‌లోనే దండోరా మోగిస్తోందట. నేతల మధ్య గ్యాప్.. అలకలు.. రుసరుసలు.. బుజ్జగింపులు.. ఒక్కటేమిటి.. కొత్త పంచాయితీ రంజుగానే ఉందట. ఇంద్రవెల్లిలో కాదు.. కాంగ్రెస్ నాయకుల మధ్య దండోరా! తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పేరుతో ఆ వర్గాలకు మరింత చేరువ కావాలని నిర్ణయించింది.…