ఆ మధ్య తెలంగాణ బీజేపీలో కొందరు సీనియర్లు.. పాతతరం నాయకుల తీరు కలకలం రేపింది. పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న వాళ్లంతా.. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జట్టుకట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కమలాన్ని కలవర పెట్టాయి. సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దించి.. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాంతో పాత నేతలు చల్లబడినట్టు సమాచారం. అయినప్పటికీ తమకు బీజేపీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయంలోనే…
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో…
తెలంగాణలో మరింత విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం పదే పదే రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తోంది. ప్రజా సమస్యలు.. రాజకీయ అంశాలపై అటెన్షన్ తీసుకొస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరగడానికి వివిధ పార్టీల్లో శక్తికేంద్రాలుగా ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దాంతో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో జాయినింగ్స్ లేవు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత వలసలు…