విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో భక్తుల రాక భారీగా ఉండనుందని దేవస్థాన అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు సుమారు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే.. ఆదివారం కావడంతో పాటు భవానీ దీక్షల విరమణల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం 3:30 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షల విరమణలు ఉండడంతో అంతరాలయ…