ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ పీవీ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధు ఇప్పటివరకు…
ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్ 10-5తో సులభంగా గేమ్ గెలిచేలా కనిపించింది.…