అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ఇచ్చింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించ లేదు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పనట్లైంది.
Also Read:Nara Lokesh meets PM Modi: కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసి నారా లోకేష్.. 2 గంటల పాటు చర్చలు..
ఇండోనేషియాలోని సుమత్రాలో కూడా భూకంపం సంభవించింది. సుమత్రాలో 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, మే 18 ఆదివారం తెల్లవారుజామున 2:50 గంటలకు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 58 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. సుమత్రాలో భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
An earthquake with a magnitude of 3.8 on the Richter Scale hit Dibang Valley, Arunachal Pradesh at 05:06:33 IST today: National Center for Seismology pic.twitter.com/n7NntxFpKY
— ANI (@ANI) May 18, 2025